ప్రస్థుతం భారత్ లో నెలకొని ఉన్న పరిస్థుతుల దృష్ట్యా ... భారత్  ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆపరేషన్ ఈగిల్-ఐతో స్టేడియంతోపాటు రహదారులను సాంకేతిక పరిజ్ఞానంతో ఒకే గొడుకు కిందకు తెచ్చారు. దీనికోసం 250 సీసీ కెమెరాలతో స్టేడియంతోపాటు బయటి ప్రాంతాలను క్షుణ్ణంగా ప్రతి అడుగును వీక్షించనున్నారు. గత వారం రోజుల నుంచి స్టేడియాన్ని సాంకేతిక పరంగా మూడుసార్లు రెక్కీ చేసి సమర్థవంతమైన భద్రతను కల్పించారు.

Image result for india australia match

కెమెరాల్లోని ప్రతి దృశ్యాన్ని చూసేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఐటీ సెల్ విభాగానికి చెందిన 30మంది సిబ్బంది 18 స్ర్కీన్ ల ద్వారా ప్రతి మూలను పరిశీలించనున్నారు. ఇలా సాంకేతికంగా స్టేడియంతో పాటు ఆ చుట్టు పరిసరాలను జల్లెడ పట్టిన పోలీసులు టెక్నాలజీతోపాటు 2300 సిబ్బందిని మోహరించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రవేశించే ప్రతి ప్రేక్షకుడు, అభిమాని చిత్రాన్ని 250సీసీ కెమెరాలు రికార్డు చేయనున్నాయి.


స్టేడియంలోని ప్రతి గ్యాలరీని స్పష్టంగా కెమెరాలు చిత్రీకరించనున్నాయి. రాత్రి సమయంలో కూడా దృశ్యాన్ని స్పష్టంగా చిత్రీకరించేందుకు ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలను ఉపయోగిస్తున్నారు. స్టేడియానికి దారి తీసే రామంతాపూర్, స్ట్రీట్ నం.8, జెన్‌ప్యాక్-హబ్సిగూడ రోడ్డు, ఉప్పల్ రింగ్‌రోడ్డు- స్టేడియం రహదారుల్లోని సీసీ కెమెరాలను కేంద్రీకృత కమాండ్ కంట్రోల్‌కు కనెక్టివిటీని ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: