స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మ్యాచ్ ఫలితాన్ని శాసించే చివరి వన్డే బుధవారం జరుగనుంది.  ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ కొదమసింహాల్లా పోరాడనున్నాయి. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లలో విజయం సాధించి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఇదే చివరిదికానుంది.

finch - kohli

మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం 2020 మే నుంచి ఏ రెండు జట్ల మధ్య కూడా మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగదు. మరోవైపు, ఆసీస్‌తో స్వదేశంలో వరుసగా మూడు వన్డే సిరీస్‌లను నెగ్గిన టీమిండియా అదే రికార్డును కొనసాగిస్తూ మరో సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది.  తాజాగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు 4 ఓవర్లు ముగిసేనాటికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.  ఖవాజా 22, ఫించ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.


భారత జట్టు: 
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జాదవ్, విజయ్ శంకర్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు: 
ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆష్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, జై రిచర్డ్‌సన్, ఆడం జంపా, నాథన్ లయన్, మార్కస్ స్టోనిస్




మరింత సమాచారం తెలుసుకోండి: