ఇప్పుడు ప్రపంచమంతా క్రీడాభిమానులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.   ఈ మచ్ లో అథిరథ మహారథులుగా ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు ఇంతవరకు ఒక్క గెలుపు కూడా తమ ఖాతాలో వేసుకోలేదు.  బలమైన జట్లలో ఒకటైన బెంగళూరు..వరుసగా ఓటమి పాలవుతూ క్రీడాభిమానులను నిరుత్సాహ పరుస్తున్నారు. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ అంచనాలను తాకలేకపోతోంది.  అయితే ఇలా బెంగుళూరు వైఫల్యంపై ఆ జట్టు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. 

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు వెలుబుచ్చారు.  హైదరాబాద్ తో మ్యాచ్  ఓటమి అనంతరం నేను, విరాట్‌ బస్సులో వెనకాల సీట్లలో కూర్చున్నాం. ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఆ సమయంలో మాట్లాడటానికి ఇద్దరికీ మాటలు రాలేదు.  తమ టీమ్ లో ఎంతో గొప్ప ఆటగాళ్లు ఉండి కూడా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అంత ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడం ఒకింత కలవరపాటుకు గురి చేసిందని అన్నారు. 

రెండు వారాల నుంచి మా జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.  ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఉండొచ్చు.  ఇప్పుడు మా లోపాలు ఏంటో గ్రహించి వచ్చే మ్యాచ్ లలో తప్పకుండా గెలిచి చూపిస్తామని ఏబీ డివిలియర్స్‌ అన్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రాజస్థాన్‌తో ఈ రోజు రాత్రి జైపూర్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ చెలరేగి ఆడే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: