మన్కడింగ్‌తో విజయానికి దూరమైన రాజస్థాన్ ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. శ్రేయాస్ గోపాల్ (3/12) స్పిన్ మ్యాజిక్‌కు తోడు.. బట్లర్ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని రాయల్స్ సులువుగానే ఛేదించింది. మరోవైపు వేదికలు మారినా.. ప్రత్యర్థులు మారినా.. బెంగళూరు తలరాత మాత్రం మారడం లేదు. ఐపీఎల్‌ 12వ సీజన్‎లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.

IPL 2019 : Rajasthan beat Royal Challengers Bangalore

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.  మకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థులే అని తెలిసినా.. పార్థివ్ (41 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్)కు సహకారం ఇవ్వవడంలో విఫలమైన ఆర్‌సీబీ స్టార్స్ యధావిధిగా పాతకథను పునరావృతం చేశారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ గోపాల్‌ (3/12) స్పిన్‌ మాయాజాలానికి తడబడిన బెంగళూరు మొదట 4 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. 

బెంగళూరు: కోహ్లీ (బి) గోపాల్ 23, పార్థివ్ (సి) రహానే (బి) ఆర్చర్ 67, డివిలియర్స్ (సి అండ్ (బి) గోపాల్ 13, హెట్మెయర్ (సి) బట్లర్ (బి) గోపాల్ 1, స్టోయినిస్ నాటౌట్ 31, అలీ నాటౌట్ 18, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 158/4. వికెట్లపతనం: 1-49, 2-71, 3-73, 4-126. బౌలింగ్: గౌతమ్ 4-0-19-0, కులకర్ణి 3-0-26-0, ఆర్చర్ 4-0-47-1, గోపాల్ 4-1-12-3, ఆరోన్ 1-0-16-0, బిన్నీ 1-0-6-0, స్టోక్స్ 3-0-29-0.


రాజస్థాన్ : రహానే ఎల్బీ (బి) చాహల్ 22, బట్లర్ (సి) స్టోయినిస్ (బి) చాహల్ 59, స్మిత్ (సి) ఉమేశ్ (బి) సిరాజ్ 38, త్రిపాఠి నాటౌట్ 34, స్టోక్స్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 19.5 ఓవర్లలో 164/3. వికెట్లపతనం: 1-60, 2-104, 3-154. బౌలింగ్: ఉమేశ్ 3.5-0-40-0, సైనీ 4-0-35-1, సిరాజ్ 4-0-25-1, చాహల్ 4-0-17-2, స్టోయినిస్ 3-0-28-0, మొయిన్ అలీ 1-0-14-0.



మరింత సమాచారం తెలుసుకోండి: