ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ధోనీ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ముంబై బ్రేకులు వేసింది.  చెన్నై సూపర్ కింగ్స్‌ దూకుడు చూస్తుంటే..ట్రోఫీ తప్పకుండా సొంతం చేసుకుంటారని అందరూ భావించారు..అదే రీతిలో దోనీ సేన దూకుడు కూడా పెంచింది.   కానీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ముంబై బ్రేకులు వేసింది. బౌలర్లు లసిత్ మలింగ, హార్దిక్ పాండ్యా, బెహ్రెండార్ఫ్ ‌లు తమ బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించారు. 


 వాంఖడేలో  జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ తొలుత టపటపా వికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో మునిగినట్టు కనిపించింది.  సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యాలు రాణించడంతో జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. 43 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 8 ఫోర్లు, సిక్సర్‌తో 59 పరుగులు చేయగా, 32 బంతులు ఆడిన కృనాల్ పాండ్యా 5 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. 8 బంతులు మాత్రమే ఆడిన పాండ్యా ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేయగా, 7 బంతులు ఆడిన పొలార్డ్ 2 సిక్సర్లతో 17 పరుగులు చేశాడు.


దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పేలవంగా ఆడటం మొదలు పెట్టింది.   ముంబై బౌలర్లు మలింగ, హార్దిక్ పాండ్యా, జాసన్ బెహ్రెండార్ఫ్‌లు చెలరేగి వికెట్లు తీశారు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కేదార్ జాదవ్(58) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో ముంబై ఖాతాలో రెండో విజయం నమోదైంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇదే తొలి ఓటమి.

మరింత సమాచారం తెలుసుకోండి: