ఐపీఎల్‌లో మ్యాచ్ ప్రారంభంమైనప్పటి నుంచి బెంగళూరు  టీమ్ వరుస పరాజయాలతో సతమతమవుతుంది.  ఆ టీమ్ లో మహా మహా ఉద్గండులు ఉన్నారు.  అయినా కూడా వరుస పరాజయాలతో పరాభవం చెందుతుంది.  విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆటగాడుగా కోహ్లీ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడూ ఇన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదు. అయితే వ్యక్తిగతంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు కూడా విరాట్ కోహ్లీ సొంతం కావడం విశేషం. 


ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ జట్టు పరాజయం చెందింది.  కానీ, ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు.  బెంగళూరు పరాజయాల బాట పడుతున్నప్పటికీ ఐపీఎల్‌లో ఇటీవలే ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. గత రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.


ఈ మ్యాచ్‌లో 84 పరుగులు చేసిన కోహ్లీ టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 243వ ఇన్సింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించి సురేశ్ రైనాను వెనక్కి నెట్టేశాడు. రైనా 284 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు సాధించగా, కోహ్లీ 243 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో కోహ్లీ 35 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: