ఈ ఐపీఎల్ సీజన్ లో డబుల్ హ్యాట్రిక్ పరాజయాన్ని ఎదుర్కొని, అభిమానులను తీవ్ర నిరాశలో పరిచి, ప్లే ఆఫ్ చాన్స్ ను దాదాపు వదిలేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.  బెంగుళూరు టీమ్ లో అంత గొప్ప ప్లేయర్లు ఉన్నా..వారి ఆటతీరు పేలవంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.  తాజాగా  బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు.


ప్రతిసారీ ఓటమికి కారణాలు చెప్పీ, చెప్పీ అలసిపోయానని, ఇక ఫ్యాన్స్ ను క్షమాపణలు కూడా అడగబోనని నిర్వేదంగా మాట్లాడారు. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. మ్యాచ్ విజయం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం.. కానీ అది జరగలేదు అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఆదివారం సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా మ్యాచ్‌లలో ఓడి పాయింట్ల ఖాతానే తెరవలేదు.  ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాము. పిచ్ పరిస్థితిపై అసహనంగా ఉన్నాను.

వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయాం. డివిలియర్స్ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాను. స్టోయినీస్, అలీలు బాగా బ్యాటింగ్ చేశారు. పిచ్ విధానంను ఢిల్లీ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు అని విరాట్ తెలిపారు. ఈ సీజన్ లో తమ జట్టు దారుణాతి దారుణంగా మాత్రం ఆడలేదని, అయితే, అన్ని మ్యాచ్ లలోనూ దురదృష్టమే వెన్నాడిందని చెప్పుకొచ్చాడు. కాగా, నిన్న ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: