ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లో కొత్త రికార్డులకు నాంది పలుకుతున్నారు ఆటగాళ్లు.  తాజాగా ఐపీఎల్‌లో కోల్‌కతా విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ రికార్డు సృష్టించాడు. మూడు బంతులాడినా పరుగే చేయని  రస్సెల్ తర్వాత ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. చహర్‌ వేసిన 12వ ఓవర్లో బౌండరీతో మొదలైన హిట్టింగ్‌కు అడ్డుఅదుపే లేకుండా పోయింది.


ఫుల్‌టాస్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా, బౌన్సర్‌ వేస్తే అప్పర్‌ కట్‌తో థర్డ్‌మ్యాన్‌ దిశగా ఎక్కడ బంతి వేసినా... అది సిక్స్‌గానే ఫిక్సయింది.  ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రస్సెల్.. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 50 సిక్సర్లు బాదాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రస్సెల్ రికార్డులకెక్కాడు. 


మొత్తానికి ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రస్సెల్ రికార్డులకెక్కాడు.  గతంలో క్రిస్‌గేల్ రెండు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. 2012 సీజన్‌లో 59 సిక్సర్లు కొట్టిన గేల్.. ఆ తర్వాతి ఏడాదిలోనే 51 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన వీరిద్దరూ విండీస్ ప్లేయర్లే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: