ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాన్ సంబరాలు జరుగుతున్నాయి.  దేశంలో ఓ వైపు ఎన్నికల హడావుడి..మరోవైపు ఐపిఎల్ మ్యాచ్ ప్రజలు టీవిలకు అతుక్కుపోయే పరిస్థితి ఉంది.  ఇక ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా క్రీడాకారులు చేస్తున్న చిత్ర విచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రికార్డుల పరంపలు కొనసాగుతూనే ఉన్నాయి. 

తాజాగా రోహిత్ శ‌ర్మ‌ జరిమానాకు జరిమానా విధించారు.  వివరాల్లోకి వెళితే..  కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో 233 పరుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ముంబైను గ‌ట్టెంకించాల‌ని రోహిత్ శ‌ర్మ ఎంతో కష్టపడ్డాడు.  నాలుగో ఓవర్‌ వేసేందుకు కోల్‌కతా ఫాస్ట్‌ బౌలర్‌ గర్నీ బౌలింగ్ చేశాడు.. ఓవర్‌లో మూడో బంతికి రోహత్‌శర్మను అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.

రోహిత్‌శర్మ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరాడు.  థర్డ్‌ అంపైర్‌.. ‘అంపైర్స్‌ కాల్‌’కు అవకాశం ఇచ్చాడు.మైదానంలో అంపైర్‌గా ఉన్న నితిన్‌ మీనన్‌ ముంబయి ఔట్‌గా ప్రకటించడంతో రోహిత్‌ అసహనానికి గురయ్యాడు.  అదే సమయంలో అంపైర్‌ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న వికెట్లను తన బ్యాటుతో కొట్టాడు. దీంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రోహిత్‌శర్మకు మ్యాచ్‌ ఫీజులో 15శాతం కోత పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: