ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు త్వరలో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  క్రికెట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ మ్యాచ్ లు జరిగినా సరే టివిలకు అతుక్కుపోతుంటారు.  మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్ లతో ఎంజాయ్ చేసిన క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు వరల్డ్ మ్యాచ్ తిలకించేందుకు సిద్దమవుతున్నారు. 

ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది.  తాజాగా వరల్డ్ కప్ మ్యాచ్ ల విన్నర్ అయిన వారికి ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు పలుకుతారు..అది కామన్ కానీ ఈ సారి ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్ మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది.

విజేతకు రూ.28 కోట్లు నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టు సైతం రూ.14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్ తో సరిపెట్టుకున్న జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనున్నారు. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: