ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 గురువారం నాడు ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఫేవరెట్‌ బరిలోకి దిగి, అదిరిపోయే విజయం తో ఆరంభించింది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ల మధ్య జరగ్గా, 104 పరుగుల తేడాతో  దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. 

312 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన సఫారీ సేన 39.5 ఓవర్లకు 207 పరుగులకే కుప్పకూలి తొలి మ్యాచ్ లోనే పరాజయం పాలయ్యింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డికాక్‌(68), డసెన్‌(50) ఫర్వాలేదనిపించిన మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.  ఐపీఎల్‌ హీరో జోఫ్రా ఆర్చర్‌(3/27), ఫ్లంకెట్‌(2/37), స్టోక్స్‌(2/12)లు వరుస విరామాల్లో వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. 


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేయడంతో భారీ  స్కోర్ సాధించింది. 


ఓపెనర్ జాసన్ రాయ్ 54, జో రూట్ 51, ఇయాన్ మోర్గాన్ 57 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 89 పరుగులు చేశాడు.సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి ఒక్కడే 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న బెన్‌ స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: