ప్రపంచ కప్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ను 104 పరుగుల తేడా తో చిత్తు చేసి, ముందంజ వేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించగా, దక్షిణాఫ్రికా జట్టు తొలుత  బౌలింగ్ లో అంతంతరం లక్ష్య ఛేదన లో తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జేసన్ రాయ్ (54 ), జో రూట్ (51 ), ఇయాన్ మోర్గాన్ (57 ), బెన్ స్ట్రోక్ (89 )లు అర్ధ సెంచరీ లతో రాణించడం తో ప్రత్యర్థి ముందు ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 


జవాబుగా బ్యాటింగే ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం తడబడి, డికాక్ (68 ),డసెన్ (50 ) నిలకడగా రాణించడం తో కుదురుకున్నట్లే  కన్పించినా, లక్ష్య ఛేదన లో ఘోరంగా విఫలమైఓటమి పాలయింది. ఇంగ్లాండ్ బౌలర్లు జొఫ్రా ఆర్చర్ మూడు, ఫ్లంకెట్ , స్ట్రోక్స్ చేరి రెండు వికెట్లుదక్కించుకుని జట్టు విజయం లో కీలకపాత్ర పోషించారు.


అంచనాల మేరకు రాణింపు

ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు అభిమానుల అంచనాల మేరకు రాణించింది.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి తాము ఎందుకు ప్రపంచ కప్ ఫేవరేట్ జట్టుతోచెప్పకనే చెప్పింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలినా

,  మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు బాధ్యత ను తమ భుజాలపై వేసుకుని జట్టు భారీ స్కోర్ నమోదుచేసేందుకు దోహదపడ్డారు. ఈ మ్యాచ్ లో ఏకంగా నల్గురు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు అర్ధ సెంచరీ లుసాధించడం విశేషం . ఇక బౌలింగ్ విషయానికొస్తే ముగ్గురు సీమర్లు రాణించి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను కట్టడిచేయడమే కాకుండా వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.


విండీస్ ను పాక్ నిలువరించేనా?

ప్రపంచ కప్ లో భాగంగా నేడు వెస్టిండీస్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లోపేలవమైన ఆటతీరు తో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ జట్టు, విధ్వంసకర ఆటగాళ్ల తో కూడినవెస్టిండీస్ ను నిలువరిస్తుందా ? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వరల్డ్ కప్ కు ముందు ఆడిన పది మ్యాచ్ ల్లోఓటమి పాలయిన పాక్ జట్టు, వార్మప్ మ్యాచ్ లోను పేలవ ఆటతీరు ప్రదర్శించి , ఆప్ఘనిస్థాన్ చేతిలోపరాజయం పాలయిన విషయం తెల్సింది. విండీస్  తో జరిగే

ఈ మ్యాచ్ లో ఇమాముల్ హాక్, ఫేకర్ జమాన్,బాబర్ జమాన్ , హఫీజ్ లు ఎంతవరకు రాణిస్తారన్న దానిపైనే పాక్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.


పేపర్ పై వెస్టిండీస్ జట్టు పటిష్ఠంగా కన్పిస్తున్న ఆ జట్టులోని ఆటగాళ్లు ఎంతమేరకు సమిష్టిగా రాణిస్తారనేదిప్రశ్నార్ధకమే. విధ్వంసకర బ్యాట్స్ మెన్లు జెల్, రస్సెల్, హైట్ మెర్, నిలకడగా ఆడే హోప్, లూయిస్ ఇలాప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే కానీ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేసి జట్టును ముందుండి

జట్టును విజయపథాన నడిపించాల్సిన అవసరముంది. బౌలింగ్ లోను వెస్టిండీస్ జట్టు మెరుగ్గా కన్పిస్తోంది. కెప్టెన్జైసన్ హోల్డర్  , రస్సెల్ తో పాటు తుది జట్టు లో అవకాశం లభిస్తే థామస్, గాబ్రియేల్ లు రాణిస్తే విండీస్విజయకావకాశాలు మెరుగవుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: