ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూసే రోజు రానే వచ్చింది.  భారత్ పాకిస్తాన్ మధ్య ప్రపంచ కప్ లో తొలి సమరం నేడే.  ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ప్రత్యేకించి భారత్ పాకిస్తాన్   క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

 

ఇంతటి అద్భుతమైన  మ్యాచ్ కు  వరుణ గండం పొంచి ఉంది.  ఇప్పటికే ప్రపంచ కప్లో అనేక ఆటలు వర్షం కారణంగా నిలిచిపోయాయి.  భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా  వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అందుకే క్రికెట్ అభిమానులంతా కరుణించమని  వాన దేవుడిని వేడుకుంటున్నారు.  వర్షం కారణంగా ఈ భారత్ పాక్ మ్యాచ్ కూడా రద్దయితే జరిగే నష్టం  కోట్ల రూపాయల లోనే ఉంటుంది.  ఈ ప్రపంచ కప్ అధికార  ప్రసార హక్కులు ఉన్న స్టార్ ఇండియా కనీసం వంద కోట్ల రూపాయలు నష్టపోతుందని ఓ అంచనా.

 

ఇప్పటికే వర్షం కారణంగా ప్రపంచ కప్లో 4 మ్యాచులు  రద్దయ్యాయి.  వీటివల్ల స్టార్ ఇండియా 100 కోట్ల వరకు నష్టపోయింది.  భారత్-పాక్ మ్యాచ్  రద్దయితే ఈ నష్టం  రెండు వందల కోట్లకు చేరుతుందని  అంచనా.   మ్యాచ్ ప్రసారమయ్యే సమయంలో పది సెకన్ల యాడ్ పాతిక లక్షల వరకు  పలుకుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: