సెలెబ్రిటీలు ఏది చేసినా జనాలు ఎగబడి చూస్తుంటారు. ఇండియాలో సినిమా స్టార్లకి, క్రికెటర్లకి  ఆదరణ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళేం చేసినా ఇట్టే తెలిసిపోతుంటుంది. వ్యక్తిగత విషయాలు కూడా తెలియాలని అనుకుంటారు.  వాళ్ళకంటూ సెపరేట్ స్పేస్ ఉంటుందన్న విషయం మర్చిపోతారు. ఇటీవల సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు తమ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తానీ  క్రికెటర్  ఆల్ రౌండర్ అయిన షోయబ్ మాలిక్ ని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే ఇంగ్లండ్ లో క్రికెట్  ప్రపంచ కప్ జరుగుతున్న సందర్భంగా వీరు అక్కడే ఉంటున్నారు.  అయితే వీరు పార్టీ చేసుకుంటున్న వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసారు.

 

పాకిస్తాన్ మ్యాచ్ ముందురోజు వీళ్ళు ఇలా పార్టీ చేసుకోవడం వల్ల వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకి  సానియా మీర్జా తీవ్రంగా స్పందించారు. తాము ప్రైవేట్ ప్లేస్ లీ ఉంటే మీకు విడియో ఎలా తీయాలనిపించింది . మాతో పాటు మా కొడుకు కూడా ఉన్నాడు. మనుష్యుల పట్ల ఆ మాత్రం గౌరవం కూడా ఉండదా ? అనుమతి లేకుండా వీడియో తీసారంటూ, ఇటువంటివి వేరే మంచివి చేస్తే ఇంకా బాగుంటుంది అంటూ స్పందించింది.

 

ఇదేగాక సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు అంతకు ముందు అర్థరాత్రి 2 గంటల వరకు షాపింగ్ చేసిని వీడియో కూడా వైరల్ అయింది.  ఆ తర్వాతి రోజు మ్యాచ్ లో షోయబ్ మాలిక్ డక్ అవుట్ అవడంతో కొందరు పాకిస్తానీలు సానియా మీర్జా పై ట్రోల్స్ చేసారు. ఇవన్నీ నిజమైతే ఈ ప్రపంచకప్ తర్వాత షోయబ్ మాలిక్ రిటైర్ మెంట్ అవుతాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: