అర్జున్ ని చూసి సచిన్ గర్వపడాలి.క్రికెట్ చరిత్రలో ఇంతింతై వటుడింతై అన్నట్టు సచిన్ టెండూల్కర్ ఎదిగిన తీరు మనందరికీ తెలుసు, సచిన్ క్రికెట్ ఆడే వాడు అని కాకుండా సచిన్ ఆడిందే క్రికెట్ అనే స్థాయికి ఎలా ఎడిగాడో మనందరికీ తెలుసు, అలాంటి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి సచిన్ లాంటి ఆటతీరును ప్రదర్శించి అలరిస్తాడని అభిమానులు అనుకున్నారు.
కానీ తొలిదశలో అర్జున్ టెండూల్కర్ ఆట తీరు చూసిన చాలా మంది అతన్ని విమర్శించారు, మరికొంతమందైతే పండిత పుత్రః పరమశుంఠః అని ఎగతాళి చేశారు, కానీ అవేం పట్టించుకోకుండా తన ఆట తీరును,అందులోని మెలకువలను మెరుగుపరుచుకున్నాడు అర్జున్ టెండూల్కర్, ఇప్పుడు అతని ఆటతీరు చూస్తున్న వారందరూ నోరెళ్లబెడతారు, ముఖ్యంగా బౌలింగులో అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్.
ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్ లో తన శిక్షణ కొనసాగిస్తున్నాడు రీసెంట్ గా అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చేస్తుండగా జియో రూట్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది ,ఆ వీడియోని చూసిన అభిమానులు అర్జున్ టెండూల్కర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. సింహం కడుపులో సింహమే పడుతుందని,అర్జున్ ని చూసి సచిన్ గర్వపడతాడాని కొనియాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: