ప్రపంచంలో మేటి క్రికెట్ ఆటగాళ్లు ఎవరంటే టక్కున చెబుతారు సచిన్ టెండుల్కర్ అని..ఆయన తర్వాత అంత గొప్ప పేరు సంపాదించిన మరో ఆటగాడు వెస్టిండీస్ లెజెండ్ క్రికెటర్ బ్రియాన్ లారా.  తాజాగా బ్రిలియాన్ లారా గుండెపోటుతో ముంబై హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.  మంగళవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన లారా కు ఛాతి నొప్పి రావడంతో.. పరేల్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రపంచకప్ ను టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ కు బ్రియాన్ లారా క్రికెట్ ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారు. 


2019 క్రికెట్ వరల్డ్ కప్‌లో స్పోర్ట్స్ నెట్‌వర్క్ తరపున పనిచేస్తున్నారు. ముంబైలోని పారెల్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్ లో ఆయన చేరారు. మే2వ తేదీతో 50ఏళ్లు పూర్తి చేసుకున్న లారా పేరిట గ్రేట్ బ్యాట్స్‌మన్ చరిత్ర ఉంది.


టెస్టు క్రికెట్ చరిత్రలో 400పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ లారా.  దాంతో పాటు 501పరుగుల వ్యక్తిగత రికార్డుతో టాప్ నెం.1గా నిలిచాడు.   1990 నుంచి 2007 వరకూ వెస్టెండీస్ తరఫున 131 టెస్టులు, 299 వన్డేలు ఆడారు. 131 టెస్టుల్లో 34 సెంచరీలు, 48 అర్థశతకాలతో 11,953 పరుగులు చేశారు. 299 వన్డేల్లో లారా 10 సెంచరీలు, 63 అర్థ సెంచరీలతో 10,405 పరుగులు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: