వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. త్వరలో ఇండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తరువాత అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత రిటైరవుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని కొంత వాయిదా వేశాడు. వెస్టిండీస్ వచ్చే ఆగష్టులో ఇండియాతో స్వదేశంలో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్ ల తరువాత క్రికెట్లో గేల్ విధ్వంసం ముగుస్తుంది. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో తన అరంగేట్రం ఇండియా తో జరిగితే.. క్రికెట్ కు వీడ్కోలు పలికేది కూడా ఇండియాతో ఆడే మ్యాచ్ తోనే కావడం విశేషం.

 

క్రిస్ గేల్ 1999లో ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 7,214 పరుగులు, వన్డేల్లో 10,345, టెస్టుల్లో 1,627 పరుగులు చేశాడు. వెస్టిండీస్ లో బ్రయాన్ లారా తరువాత విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా గేల్ నిలిచాడు. ప్రత్యర్ధుల బౌలింగ్ ను చితక్కొడుతూ మైదానంలో చెలరేగిపోయాడు. మైదానంలో గేల్ చేసిన “గంగమ్ స్టైల్” డ్యాన్స్ కొన్నేళ్ల క్రితం ఓ సెన్షేషన్.


మరింత సమాచారం తెలుసుకోండి: