ధోని ఆట పట్ల చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ధాటిగా ఆడాల్సిన సమయంలో  సింగిల్స్ తీస్తూ అభిమానులకు చిరాకు తెప్పించే విధంగా ధోని బ్యాటింగ్ ఉందని చెప్పాలి. ఆఖరి ఓవర్లో మాత్రమే సిక్స్ కొట్టడానికి  ప్రయత్నించడం.. అనే  థియరీని ఫాలో అవుతున్నాడు మహేంద్రసింగ్ ధోనీ. నలభై తొమ్మిదో ఓవర్లు కూడా ధోనీ సింగిల్సే తీస్తాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో అయినా, చేజింగ్ లో అయినా ధోనీ అలా తెడ్డువేస్తూ బ్యాటింగ్ సాగిస్తూ ఉన్నాడు. ధోనీ మెరుపులు చూసి చాలాకాలం అయిపోయింది. 


ఇదే సమయంలో ధోనీకి వయసు కూడా మీద పడింది. ఆ ప్రభావం కీపింగ్ లోనూ కనిపిస్తూ ఉంది. జంపింగ్ లు చేసి క్యాచ్ లు పట్టడంలో ధోనీకి శరీరం సహకరిస్తున్న దాఖలాలు లేవు. కుర్రాడిలా ఇప్పుడు ధోనీ కీపింగ్ చేయలేని విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒకవైపు జాతీయ జట్టులో స్థానం కోసం చాలామంది కుర్రాళ్లు ఎదురుచూపుల్లో ఉన్నారు. ప్రస్తుత టీమిండియాలోనే ధోనీతో సహా ముగ్గురు స్పెషలిస్ట్  కీపర్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ఇన్నేళ్లూ ఆడినందుకు గానూ ధోనీ గౌరవంగా తప్పుకుంటే బావుంటుందని ఆయన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.


కొహ్లీకి సలహాలు ఇవ్వడానికి.. ధోనీ టీమ్ లో కొనసాగడం అంటే అది కొహ్లీకి కూడా అవమానమే. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ధోనీ సలహాలు ఇవ్వాలి, ఒత్తిని కొహ్లీ తట్టుకోలేడు  అంటే..కొహ్లీ కూడా కెప్టెన్సీని  వదులుకుని రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వొచ్చు. ఆటగాడిగా అద్భుతాలు చేస్తూ రోహిత్ కెప్టెన్ గా కూడా వివిధ సందర్భాల్లో తన పటిమను చూపించాడు. కాబట్టి.. కొహ్లీ కోసం ధోనీ, ధోనీ కోసం కొహ్లీ అన్నట్టుగా కాకుండా.. జట్టు ప్రయోజనాలను ఆలోచిస్తే బావుంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: