వరల్డ్ కప్ క్రికెట్లో మరో అద్భుతం జరగింది. ఒక వరల్డ్ కప్ లో 5 సెంచరీలు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 2015 వరల్డ్ కప్ లో శ్రీలంక ఆటగాడు సంగక్కర 4 సెంచరీలతో నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు. వరుస సెంచరీలతో రోహిత్ హీరో అయ్యాడు. చక్కటి షాట్స్ తో చూడముచ్చటైన ఇన్నింగ్స్ తో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

 

వరల్డ్ కప్ లో 2003లో సచిన్ చేపిన 673 పరుగులే ఇప్పటికీ ఏ వరల్డ్ కప్ లోనైనా అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పటికే 647 పరుగులు చేసిన రోహిత్, ఇక సచిన్ రికార్డుకు గురి పెట్టాడు. మరో 26 పరుగులు చేస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డు సృష్టిస్తాడు. సెమీఫైనల్లో ఆ రికార్డుతో పాటు సెంచరీ చేసి మరో రికార్డు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఫైనల్ కి వెళ్తే మరో అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే.. ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. రోహిత్ ఇంగ్లాండ్ తో 102, బంగ్లాదేశ్ తో 104, శ్రీలంకపై 103 చేసి అవుటయ్యాడు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యచ్ లలో రోహిత్ సెంచరీ తరువాత భారీ స్కోరు చేసే అవకాశమున్నా ఔటయ్యాడు. ఆటలో అలసిపోయి ఔటవ్వడం వేరు.. నిర్లక్ష్యపు షాట్లతో అవుటవడం వేరు. పరిశీలిస్తే ఈ మూడు సార్లు రోహిత్ అవుటయిన విధానం నిర్లక్ష్యపు షాట్ల వల్లే అని అర్ధమవుతుంది.


వచ్చే సెమీఫైనల్ మ్యాచ్ మరింత కీలకం. ప్రతి బాల్ జాగ్రత్తగా ఆడాల్సిందే. ప్రత్యర్ధికి ఏ ఒక్క అవకాశం ఇచ్చినా చాలా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రోహిత్ హిట్ అవుతూనే ఉన్నాడు. మంచి ఫామ్ లో ఉండడంతో మరింత జాగ్రత్తగానే ఆడతాడు. సందేహం లేదు. కాకపోతే.. జట్టు భారీ స్కోరు సాధించేందుకు సెంచరీ చేయడమే కాకుండా మరింత సేపు క్రీజ్ లో నిలిస్తేనే ఉపయోగం.


మరింత సమాచారం తెలుసుకోండి: