ఈ ప్రపంచ కప్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ మరోసారి అలవోకగా సెంచరీ చేసేశాడు.. శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో రోహిత్‌ శర్మ 94 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 103 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ఐదో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.


గత ప్రపంచకప్‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు చేశాడు. ఇప్పటికే ఈ మార్కు చేసిన రోహిత్ శర్మ శనివారం మ్యాచ్ తో కొత్త రికార్డు నెలకొల్పాడు. లీగ్‌ దశలోనే రోహిత్ రికార్డుల పరంపర సృష్టిస్తున్నాడు. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే టాప్ స్కోరర్ గా ఉన్న రోహిత్ శర్మ.. సచిన్ రికార్డుపై కన్నేశాడు.


ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2003లో 673 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ దీన్ని ఎవరూ బీట్ చేయలేదు. కానీ రోహిత్ ఈసారి కచ్చితంగా దీన్ని బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


ఎందుకంటే సచిన్ రికార్డుకు రోహిత్‌ ఇంకో 26 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఇంకో విశేషం ఏంటంటే.. సచిన్‌ ఆరు ప్రపంచకప్‌లు ఆడి, 44 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలతో రికార్డు నెలకొల్పాడు. రోహిత్ మాత్రం రెండో ప్రపంచకప్‌ లోనే... అందులోనూ కేవలం 16 ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డు దగ్గరకు వచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: