శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అలవోకగా నెగ్గడం ద్వారా టీమిండియా పాయింట్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లింది. ఇండియా నెగ్గడం.. అదే సమయంలో ఆస్ట్రేలియా సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో టీమిండియా 15 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 0.809 రన్ రేట్ సాధించింది.


ఇక సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాకు 14 పాయింట్లు ఉన్నాయి. 12 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలోనూ.. 11 పాయింట్లతో న్యూజీలాండ్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి.


లీగ్ మ్యాచ్ లు పూర్తికావడంతో ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో, ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. భారత్‌కు అగ్రస్థానం ఖరారవడంతో.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఖరారైంది. 9 వ తేదీన ఇండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరో సెమీఫైనల్ 11న జరుగుతుంది.


టీమిండియా మొత్తం 9 మ్యాచుల్లో 7 నెగ్గింది. ఒకటి ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా 7 నెగ్గింది. రెండు ఓడింది. ఇంగ్లండ్ 6 నెగ్గింది. మూడు ఓడింది. న్యూజీలాండ్ 5 నెగ్గింది.. మూడు మ్యాచ్ లు ఓడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: