ఇండియన్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ, ఇప్పటివరకు నమోదు అయిన రికార్డులను చెరిపేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ ఆ ఆరు సెంచరీల కోసం ఐదు ప్రపంచకప్ లు ఆడాల్సి వచ్చింది! ప్రపంచ క్రికెట్లో ఇంత వరకూ ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు సాధించిన మొనగాడు ఎవరూ లేరు. అలాంటి అరుదైన రికార్డును సునాయాసంగా సాధించి చూపాడు రోహిత్ శర్మ. శ్రీలంకతో లీగ్ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ అత్యంత అరుదైన రికార్డును స్థాపించాడు.


ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు సాధించిన క్రికెటర్ గా రోహిత్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇది వరకూ ఒకే ప్రపంచకప్ లో నాలుగు సెంచరీలతో శ్రీలంకన్  స్టార్ బ్యాట్స్ మన్ సంగక్కర పేరిట ఉన్న రికార్డును రోహిత్ చెరిపేశాడు. ఈ ప్రపంచకప్ లో ఐదో సెంచరీతో వావ్ అనిపించాడు! ఇక ప్రపంచకప్ లలో మొత్తం ఆరు సెంచరీలతో సచిన్ పేరిట ఉన్న రికార్డుకు కూడా చేరువయ్యాడు రోహిత్.


సచిన్ టెండూల్కర్  తన కెరీర్ ఆసాంతం ఆడిన అన్ని ప్రపంచకప్ లలో కలిపి ఆరు సెంచరీలు చేయగా.. రెండో ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్ ఆరో సెంచరీని పూర్తి చేశాడు. ఇంకా సెమిస్ మ్యాచ్ అవకాశం ఉంది రోహిత్ కు. ఆ మ్యాచ్ లోనూ ఇంతే ఈజీగా మరో సెంచరీ చేశాడంటే.. మరో సరికొత్త రికార్డును స్థాపించినవాడవుతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: