టీమిండియా మాజీ కెప్టెన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నాడని వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. క్రికెటర్ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకోబుతున్నాడు అంటే ఆ వార్తలు అన్ని ఎలాంటి గుస గుసలాగా మారుతాయో తెలీదు. ఆ క్రికెటర్ రిటైర్మెంట్ తరువాత సినిమాల్లోకి వస్తాడట, ఈ క్రికెటర్ రాజకీయాల్లోకి వస్తాడట, అధికారంలో ఉన్న బీజేపీలో చేరుతాడట, అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ లో చేరి అధికారంలో తీసుకొస్తాడట, అనే వార్తలు సోషల్ మీడియా వేధికగా భారీగా వినిపిస్తాయి. 


ఈ నేపథ్యంలోనే అప్పట్లో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారాని, గంభీర్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో స్వయంగా ఆ వార్తలపై స్పందించిన గంభీర్ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చెయ్యాల్సి వచ్చింది. అచ్చం ఇలానే ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీజేపీలో చేరనున్నారని గుసగుసలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. 


అసలు ధోని ఇంకా 'క్రికెట్'కు రిటైర్మెంట్ ప్రకటించనే లేదు 'అతని రిటైర్మెంట్ గురించి అతనికే తెలీదు అని చెప్పిన ధోని'పై అప్పుడే రాజకీయాల్లోకి రానున్నారని, అధిష్ఠానం ఇప్పటికే ధోనితో సంప్రదింపులు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలకు కొందరు బీజేపీ నేతలు కూడా ప్రాణం పోస్తున్నారులెండి. గత సంవత్సరంలో 'సంపర్క్ ఫర్ సమర్థన్' కార్యక్రమంలో అమిత్ షా ధోని ఇంటికి వెళ్లడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో ధోనీయే చెప్పాలి... 


మరింత సమాచారం తెలుసుకోండి: