నేడే భారత్-కివీస్ సెమీ ఫైనల్ మ్యాచ్. ఇప్పటికే వరుస విజయాలతో భారత్ భీకర ఫామ్ లో ఉంది. ఓపెనర్స్ బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. అయితే గత పర్యాయం ఆసీస్ చేతిలో సెమిస్ లో ఓటమి పాలైంది టీమిండియా. ఈసారి కివీస్ తో సెమిస్ మ్యాచ్ ఆడుతోంది. మరికొన్ని  గంటల్లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈసారి సెమిస్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న కొహ్లీ, విలియమ్సన్ లు గతంలోనూ తమ తమ టీమ్ లతో సెమిస్ లో తలపడ్డారు.


అది అండర్ 19 ప్రపంచకప్ లో! కొహ్లీసేన అప్పుడు విజేతగా నిలిచింది. అండర్ 19 జట్టును ప్రపంచకప్ విజేతగా నిలపడం ద్వారానే కొహ్లీ మొదట గుర్తింపును సంపాదించుకున్నాడు. దాంతోనే అతడికి ఐపీఎల్ లో చోటు లభించింది. ఇప్పుడు కూడా కొహ్లీ తన సేనతో విలియమ్సన్ జట్టుతో తలపడుతూ ఉన్నాడు. ఫామ్, గత వారంలోని మ్యాచ్ ల ఫలితాలను బట్టి చూస్తే.. విజయావకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయి.


ఇదివరకూ కూడా కివీస్ పలు ప్రపంచకప్ లలో సెమిస్ వరకూ వచ్చి వెనుదిగింది. గత ప్రపంచకప్ లో మాత్రం న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కు వెళ్లింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి విజేతగా నిలవలేకపోయింది. సెమిస్ విషయంలో టీమిండియా పూర్తి విశ్వాసంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో ఉన్న టీమిండియానే ఈ మ్యాచ్ కు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: