ఇంగ్లాండ్ లో వర్షాకాలం మొదలవ్వడంతో ఎప్పుడు వాన కురుస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.  వర్షాలు కురుస్తుండంతో వరల్డ్ కప్ కు అంతరాయం కలుగుతున్నది.  లీగ్ దశలు ఇబ్బందులు పెట్టి చివర్లో వదిలేసినా వాన, ఇప్పుడు మరలా కురవడం మొదలైంది.  


ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెష్టర్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా సగంలో ఆగిపోయింది.  అప్పటికే ఇండియా జట్టు పటిష్టంగా ఉన్నది.  నిన్న మ్యాచ్ సవ్యంగా జరిగి ఉంటె ఈపాటికి ఇండియా ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకొని సగర్వంగా పండుగ చేసుకునేది.  


కానీ ఇప్పుడు అలా జరుగుతుందా అన్నది డౌట్ గా మారింది.  వాన ఈరోజైనా కురవకుండా ఉంటుందా చూసుకోవాలి.  నిన్న వాన కురవడం వలన అవుట్ ఫీల్ చిత్తడిగా మారుతుంది.  బంతి అవుట్ ఫీల్డ్ లో వేగం తగ్గిపోతుంది.  ఫలితంగా పరుగులు రావడం ఇబ్బంది అవుతుంది.  గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.  అదేంటో ఇప్పుడు చూద్దాం. 


ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రెండో రోజుకు వాయిదా పడటం ఇది రెండోసారి. 1999లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది ఇంగ్లాండే. నాటి ప్రత్యర్థి ఆతిథ్య జట్టే. ఆ మ్యాచ్‌లో భారతే గెలవడం విశేషం. మొదట భారత్‌ 8 వికెట్లకు 232 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 20.3 ఓవర్లలో 73/3తో ఉండగా వర్షంతో మ్యాచ్‌ ఆగింది. 


మరుసటి రోజు అక్కడి నుంచే ఆట కొనసాగించారు. టపాటపా వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్‌ 169 పరుగులుకే కుప్పకూలింది. మరి సెంటిమెంటు కలిసొచ్చి రెండో రోజుకు మళ్లిన తాజా మ్యాచ్‌లోనూ భారత్‌ జయకేతనం ఎగురవేస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: