వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఆరంభంలోనే టీమిండియాకు షాక్ మీద షాక్ తగిలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. స్కోరుబోర్డుపై 4/1, 5/2, 5/3 ఇలా… 5 రన్స్ కే 3 అత్యంత కీలకమైన వికెట్లు కోల్పోయింది.

స్టార్ బ్యాట్స్ మన్, టోర్నీలో టాప్ స్కోరర్ రోహిత్ శర్మ ఒక రన్ కే ఔటయ్యాడు. 4 బాల్స్ లో ఒక రన్ చేసిన రోహిత్ శర్మ.. హెన్రీ బౌలింగ్ లో కీపర్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6బాల్స్ లో 1 రన్ చేసిన విరాట్ కోహ్లీ బౌల్ట్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు.

ఆ తర్వాత ఓవర్లో హెన్రీ మరోసారి ఇండియాను దెబ్బతీశాడు. 7 బాల్స్ లో 1 రన్ చేసిన కేఎల్ రాహుల్ హెన్రీ బౌలింగ్ లో కీపర్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.

ఎట్టకేలకు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగించి నిిమర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. టీమిండియా ఫైనల్‌ చేరేందుకు 240 పరుగుల మంచి లక్ష్యమే నిర్దేశించింది. రెండో రోజు జరిగిన మ్యాచ్ లో 23 బంతులు ఆడిన కివీస్‌ 28 పరుగులు చేసింది. వెంటవెంటనే 3 వికెట్లు చేజార్చుకుంది. ఇప్పుడు భారత్ మొదటిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ అభిమానుల నిరాశ చెందుంతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: