రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ టీమ్ 50 ఓవర్లకు న్యూజిలాండ్‌ 239/8 చేసి భారత్ కు 240 టార్గెట్ మిగిల్చింది. ఈ సారి కూడా వరల్డ్ కప్ భారత్ కు దక్కుతుందని అందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తురణంలో న్యూజిల్యాండ్ బౌలర్ల చేతిలో టీమిండియా వికెట్లు కోల్పోవడం అందరిలో భయాందోళనలు కలిగిస్తుంది.

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్‌ను బౌల్ట్‌ వేసి 2 పరుగులు చేశారు. కేఎల్‌ రాహుల్‌ (1), రోహిత్‌ (1) నిలకడగా ఆడుతుండగా ఇంతలోనే టీమిండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది. మాట్‌ హెన్రీ వేసిన 1.3వ బంతి ఆడిన రోహిత్‌ శర్మ (1; 4 బంతుల్లో) కీపర్‌ టామ్‌ లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో టీమిండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది.  టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో వికెట్ల ముందు దొరికిపోయి ఔటయ్యాడు. సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇది భారత్‌కు కచ్చితంగా పెద్ద దెబ్బే.

పంత్‌,  రాహుల్‌ (1) ఆచితూచి ఆడుతున్న సమయంలో మాట్‌ హెన్రీ వేసిన 3.1వ బంతికి కేఎల్‌ రాహుల్‌ (1; 7 బంతుల్లో) టామ్‌ లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. మాట్‌ హెన్రీ వికెట్‌ మెయిడిన్‌ వేశాడు. దినేశ్‌  కార్తీక్‌ పవర్‌ ప్లేలో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, పంత్‌ అతడికకి తోడుగా ఉన్నాడు.

చివరి సారి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఉప సారథి రోహిత్‌ శర్మ ఒక అంకె స్కోరుకే పెవిలియన్‌ చేరింది. దినేశ్ కార్తీక్‌ అన్ని బంతుల్ని డిఫెండ్‌ చేసి ఆడుతుండగా. పంత్‌ నిలకడగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు భారత్‌ 19/3. బౌల్ట్‌ 6 పరుగులు ఇచ్చాడు. 10 ఓవర్లకు భారత్‌ 24/4. హెన్రీ 5 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. చివరి బంతిని ఆడిన దినేశ్‌ కార్తీక్‌ (6; 25 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. నీషమ్‌ గాల్లోకి డైవ్‌ చేసి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.

11 ఓవర్లకు 30/4. హెన్రీ బౌలింగ్‌లో రెండో బంతిని పంత్‌(18) ఫైన్‌ లెగ్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో పంత్‌(19) తొలి బంతికే ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడగా అక్కడే ఫీల్డింగ్‌లో ఉన్న నీషమ్‌ ఆ క్యాచ్‌ను వదిలేశాడు. 14 ఓవర్లకు భారత్‌ 42/4. హెన్రీ 5 పరుగులు ఇచ్చాడు. పాండ్య (9)కు వేసిన మూడో బంతి 150 కిలోమీటర్ల వేగం అందుకుంది. 17 ఓవర్లకు భారత్‌ 51/4. టీమిండియా 50 పరుగుల మైలురాయి దాటేసింది.

18 ఓవర్లకు భారత్‌ 60/4. గ్రాండ్‌హోమ్‌ 9 పరుగులు ఇచ్చాడు. పంత్‌ (25), పాండ్య (19) చకచకా సింగిల్స్‌, డబుల్స్‌ తీశారు. హార్దిక్‌ పాండ్య ఇబ్బంది పడుతున్నాడు. ఫిజియో వచ్చి టాబ్లెట్‌ ఇచ్చాడు. బహుశా అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. 19 ఓవర్లకు భారత్‌ 62/4. ఫెర్గూసన్‌ 2 పరుగులు ఇచ్చాడు. పంత్‌ (27), పాండ్య (19) ఆచితూచి ఆడుతున్నారు.

హార్దిక్‌ పాండ్య తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నా... కండరాలు పట్టేసినట్టు కనిపిస్తోంది. 20 ఓవర్లకు భారత్‌ 70/4. నీషమ్‌ 8 పరుగులు ఇచ్చాడు. 21 ఓవర్లకు భారత్‌ 70/4. శాంట్నర్‌ సైతం తొలి ఓవర్‌ను మెయిడిన్‌ వేశాడు. శాంట్నర్‌ వేసిన 22.5వ బంతిని ఆడిన రిషభ్‌పంత్‌ (32; 56 బంతుల్లో 4×4)  గ్రాండ్‌హోమ్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఔటయ్యాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రంగలోకి దిగాడు. 23 ఓవర్లకు భారత్‌ 71/5 చేరుకుంది. 24వ ఓవరలో నీషమ్‌ 4 పరుగులు ఇచ్చాడు దీంతో పాండ్య (25), ధోనీ (1) స్కోర్ చెరుకుంది. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 77/5 తో బ్యాటింగ్ కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: