ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టులో రోహిత్ శర్మ.. కోహ్లీ... కేఎల్ రాహుల్ ముగ్గురు త‌లా ఒక‌రు చేసి అవుటయ్యారు. దీంతో కేవలం ఐదు పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి నట్లయింది. ఇదిలాఉంటే వరల్డ్ కప్ నాక‌వుట్ మ్యాచ్ అంటే భయం అని సోషల్ మీడియాలో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.


ఎందుకంటే మూడు సెమీఫైన‌ల్స్ ఆడిన కోహ్లీ మూడు సెమీఫైన‌ల్స్‌లోనూ తేలిపోయాడు. అస‌లు సిసలు స‌మ‌రంలో కోహ్లీ తేలిపోతాడ‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. 2011 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో కోహ్లి 9 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక 2015లో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియాపై కోహ్లీ ఒక ప‌రుగుతో స‌రిపెట్టుకుంటే.... తాజా వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీఫైన‌ల్లోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది. 


ఈ మూడు వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్లోనూ లెఫార్మ్‌ పేసర్లకే కోహ్లి వికెట్‌ సమర్పించుకోవడం గమనించాల్సిన విషయం. 2011వరల్డ్‌కప్‌ సెమీస్‌లో వహాబ్‌ రియాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి ఔట్‌ కాగా, 2015 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో మిచెల్‌ జాన్సన్‌ చేతికి చిక్కాడు కోహ్లి. ఇక ఈ వరల్డ్‌కప్‌ సెమీస్‌లో  ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో కోహ్లిని దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. కోహ్లీకి నాక‌వుట్ మ్యాచ్‌లు అన్నా, సెమీఫైన‌ల్ అన్నా బెదురు అని విమ‌ర్శిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: