ప్రపంచ కప్ సిరీస్ స్టార్ట్ అయినప్పటినుండి క్రికెట్ అభిమానులకు పండగ మొదలైంది, సిరీస్ మొత్తాన్ని ఉపేస్తుంది ఇండియన్ టీం,క్రికెట్ అన్నాక బ్యాటింగ్ ఎంత ముఖ్యమో బౌలింగ్ అంతే ముఖ్యం,ప్రత్యర్థులలను సవాలు చేయడానికి బ్యాట్ తో లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తారు బ్యాట్స్ మెన్ లు, అలాగే ఆ లక్ష్యాన్ని అందుకొనివ్వకుండా బౌలింగ్ కట్టడి చేస్తారు బౌలర్లు,అలా ఆట లో విజయం సాధించడంలో బ్యాటింగ్ కి, బౌలింగ్ కి సమానంగా ప్రాధాన్యత ఉంటుంది.

ఒకప్పుడు క్రికెట్ అంటే వన్ డే ఫార్మాట్ లేదా టెస్ట్ ఫార్మాట్ లో ఆడేవారు కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి,20-20 అని, ఐపీల్ అని క్రికెట్ వేడిని పెంచే ఫార్మట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఓవర్లు తగ్గాయి కానీ ఆట లో ఉండే ఎంజాయ్ మెంట్ కాదు,వన్ డే అయిన 20-20 అయిన ఒక ఓవర్ కి 6బంతులే.

సాధారణంగా క్రికెట్ లో ఒక గంటకి 12 ఓవర్లు బౌలింగ్ చేస్తారు.అంటే 5నిమిషాలకు ఒక ఓవర్ బౌలింగ్ చేస్తారు అన్నమాట, అయితే ఇది కేవలం ఫస్ట్ బౌలర్లకు మాత్రమే వర్తిస్తుంది. స్పిన్నర్స్ ఒక ఓవర్ బౌలింగ్ చేయడానికి కేవలం 3నిమిషాల టైం తీసుకుంటారు. భారత జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఒక ఓవర్ వేయడానికి రెండున్నర నిమిషాలు మాత్రమే తీసుకుంటాడు. అలాంటిది నిన్న జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో జడేజా కేవలం ఒక నిమిషం 31 సెకన్లలో ఓవర్ పూర్తి చేశాడు. ఒక బౌలర్ ఇంత తక్కువ టైం లో ఓవర్ పూర్తి చేయడం కూడా ఓ రికార్డ్ అంటున్నారు క్రికెట్ పెద్దలు.


మరింత సమాచారం తెలుసుకోండి: