ప్రపంచ కప్ సిరీస్ లో సెమీఫైనల్ చేరుకుంది భారత్, సెమీఫైనల్ వరకు విజయాలను సునాయాసంగా అందుకున్న భారత్ సెమీఫైనల్ లో మాత్రం గోరమైన ఓటమిని మూటగట్టుకుంది.విధ్వంసకరమైన బ్యాట్స్ మెన్ లను కలిగిన
ఇండియన్ క్రికెట్ టీమ్ కేవలం 24 పరుగులకే 4పెద్ద వికెట్లను కోల్పోవడం అత్యంత బాధాకరం.
టాప్ ఆర్డర్ ఆటగాళ్లు అయిన రోహిత్,రాహుల్, కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుతిరగడం వల్లే మ్యాచ్ చేజారిపోయింది. కివీస్ ఆటగాళ్లు బౌలింగ్ బాగా చేశారని,ముఖ్యంగా మ్యాచ్ స్టార్ట్ అయిన 45 నిమిషాల్లో వాళ్ళు వేసిన
బౌలింగ్ మ్యాచ్ లో కీలకంగా మారింది ఇండియన్ టీం కెప్టెన్ కోహ్లీ అన్నారు. అయితే ధోని రన్ ఔట్ కాకపోయిఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని కోహ్లీ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు దేశం మొత్తం ధోని రన్ ఔట్ మీద మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ధోని రన్ ఔట్ అయినప్పుడు పవర్ ప్లే 3 నడుస్తుంది. ఆ సమయంలో 30 యార్డ్ సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే ఆరుగురు
ఆటగాళ్లు అవుట్ ఫీల్డ్ లో ఉన్నట్టు ఓ వీడియో వైరల్ అవుతుంది. అలా అయితే ఆ బాల్ ను నో బాల్ గా అంపైర్ ప్రకటించాలి. కానీ అంపైర్ అది చూడలేదు,అంపైర్ తప్పిదం వల్లే మ్యాచ్ ఒడిపోయామని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: