ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో సెమీపైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 49 ఓవర్లకు 223 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నుంచి ఓటమిని చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న సమయంలో దాదాపు హాఫ్ టార్గెట్ పూర్తిచేశాక ఒక వికెట్ పడిపోయింది.  


అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ 65 బంతుల్లో రాయ్ 5 సిక్స్ లు, 9 ఫోర్లతో 85 పరుగులు చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ గెలుపుకు సిద్దమవుతు వారి సామర్ధ్యాన్ని చూపుతున్న ఓపెనర్ జాసన్ రాయ్ అనుకోని రీతిలో వికెట్ కోల్పోయాడు. అయితే ఈ సన్నివేశంలో అవాంఛనీయ సన్నివేశం చోటుచేసుకుంది. లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతున్న జాసన్ రాయ్ అవుట్ అంటూ అంపైర్ ప్రకటించిన నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 


నిజానికి జాసన్ రాయ్ అవుట్ కాలేదు. కానీ డీఆర్ఎస్ రివ్యూ అప్పటికే అయిపోవడంతో, రాయ్ అవుట్ అయ్యారు అని ప్రకటించేసారు. దీంతో మైదానం నుంచి వెళుతూనే అంపైర్ ధర్మసేనను నోటికొచ్చినట్టు తిడుతూ రాయ్ రెచ్చిపోయాడు. చివరికి మైదానంలో ఉన్న భారీ స్క్రీన్ పై రీప్లే చూసిన తర్వాత రాయ్ మరింతగా రెచ్చిపోయాడు. దీంతో మన భారతీయులు కూడా నిన్న కూడా మన ధోనికి ఇలాగే అవుట్ చేసారని భారతీయులు విరుచుకుపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: