ప్రపంచకప్ మన భారత్ కు పక్క వస్తుంది అని నమ్ముకున్న క్రికెట్ అభిమానుల అంచనాలపై ఒక్కసారిగా నీళ్లు చల్లారు మన క్రికెటర్లు. నీకు ఎంత అనుభవం ఉంటె ఏంటి అణువంతైనా అదృష్టం అనేది ఉండాలి అని అనేవారు పెద్దలు సరిగ్గా అదే నేపథ్యంలో మొన్న న్యూజిలాండ్ మ్యాచ్ లో మన భారత్ కు అదృష్టం లేదని తేలిపోయింది. ఈసారి ప్రపంచకప్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచి క్రికెట్ అభిమానులకు ఆశ చూపించింది టీమిండియా జట్టు. దీంతో టీమిండియా పక్క ఫైనల్ వరుకు వస్తుంది అని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 


మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో గోరంగా ఓడిపోయింది టీమిండియా. సెమిస్ కు ముందు జరిగిన మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక తలపడగా శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ప్రపంచకప్ పాయింట్స్ లో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. దీంతో పక్క మన ఇండియా ఫైనల్ వెళ్తుంది అనుకున్న టీమిండియా అభిమానులు ముందుగానే టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. కానీ అనుకోని రీతిలో టీమిండియా ఓడిపోవడంతో టికెట్ బుక్ చేసుకున్న టీమిండియా అభిమానులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.   


ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా తలపెడితే చూద్దామని ముందు టిక్కెట్లు కొనుకున్న భారత్ క్రికెట్ అభిమానులు ఇప్పుడు వాటిని విక్రయిస్తున్నారు. సెమిస్ లో కివీస్ చేతిలో ఓడి వెనుతిరగడంతో ఆ టికెట్లను అమ్మే పనిలో పడ్డారు భరత్ అభిమానులు. ఫైనల్ జరగనున్న లార్డ్స్ మైదానం సామర్ధ్యం 30వేలు కాగా, దాంట్లో 80 శాతం టికెట్లు భారత్ అభిమానులే కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంతమంది అభిమానులు టికెట్లను తిరిగి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఒక్క టికెట్ రెండు టికెట్లయితే ఒదులుకుంటారు కానీ ఒకేసారి కుటుంబమందరికి టికెట్లు కొన్న అభిమానులు అమ్మకుండా ఎలా ఉండగలరు. ఏది ఏమైనప్పటికి మన భారతీయులు టికెట్లు అమ్ముకోవడం మనకు అవమానకరమే..   


మరింత సమాచారం తెలుసుకోండి: