ప్రపంచకప్ లో గురువారం ఏక పక్షంగా సాగిన సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పై ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇరవై ఏడేళ్ల తరువాత మళ్ళీ ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. చివరి సారిగా 1992 లో తుదిపోరుకు చేరుకున్న ఇంగ్లాండ్ మళ్లీ ఈ సారి ప్రపంచకప్ టైటిల్ కు ఒక్క మ్యాచ్ చేరువలో ఉంది. గురువారం సెమీస్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ ఓపెనర్స్ గా బరిలోకి దిగారు.


మొదటి బంతి ఫోర్ తో ఆరంభించిన డేవిడ్ వార్నర్ ను క్రిస్ వోక్స్ తెలివిగా బౌలింగ్ వేసి పెవిలియన్ కు పంపించాడు. మొదటి నాలుగు ఓవర్ల లోనే మూడు వికెట్ లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను ఢీ కొట్టటానికి సరిపోయే టార్గెట్ ను ఆస్ట్రేలియా అందించలేకపోయింది. స్టీవెన్ స్మిత్ 119 బాల్లకు 85 పరుగులు,నికోలస్ కేరే 70 బాల్లకు 46 పరుగులు చేయగా, మిచెల్ స్టార్క్ 36 బాల్లకు 29 పరుగులు మరియు గెలెన్ మాక్స్వెల్ల్ 23 బాల్లకు 22 పరుగులు చేశారు.ఆరొన్ ఫించ్,మార్కస్ స్టోఇనిస్ డక్ ఔట్ లతో వెనుదిరిగారు. మిగతా వారు అంతంత మాత్రంగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్స్ క్రిస్ వోక్స్,అదిల్ రషీద్,జోఫ్రా ఆర్చర్ ల ధాటికి ఆస్ట్రేలియా ప్లేయర్ లు అంతగా రాణించలేకపోయారు.చివరకు ఆస్ట్రేలియా ప్లేయర్లు కేవలం 223 పరుగులు చేసి అతి సులభమైన టార్గెట్ ను ఇంగ్లాడ్ కు ఇచ్చి వెనుదిరిగారు.

తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జేసన్ రాయ్,బైర్స్టో ఓపెనర్ లతో దిగింది. జేసన్ రయ్ మొదటి ఓవర్ నుంచే బాదుడు మొదలుపెట్టి 9 ఫోర్లు,5 సిక్సర్లతో అదరగొట్టి అరవై ఐదు బాల్లకు ఎనభై ఐదు పరుగులు చేసి ఇంగ్లాండ్ కు మంచి స్టార్ట్ ని అందించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఇంగ్లాండ్ పై అంతగా ప్రభావం చూపలేకపోవటంతో ఈయాన్ మార్గాన్ 39 బాల్లకు 45 పరుగులు,జోయ్ రూట్ 46 బాల్లకు 49 పరుగులు,బైర్స్టో 43 బాల్లకు 34 పరుగులు చేసి 32.1 ఓవర్లకే టార్గెట్ ను సులభంగా చేదించి ఆస్ట్రేలియా పై ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.డిఫెండింగ్ చాంపియన్సైన ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: