ధోనీని సెమీ ఫైనల్ మ్యాచ్ లో 7వ వికెట్ గా పంపించడం పెద్ద తప్పిదమని గంగూలీ అభిప్రాయ పడ్డారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 239 పరుగులు చేయగా.. ఛేదనకి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లి (1) రూపంలో వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో.. ఐదో స్థానంలో మహేంద్రసింగ్ ధోనీ క్రీజులో వస్తాడని అంతా ఊహించారు.


కానీ.. నాలుగో స్థానంలో అప్పటికే రిషబ్ పంత్‌ని పంపిన టీమిండియా మేనేజ్‌మెంట్ ఐదో స్థానంలో దినేశ్ కార్తీక్ (6), ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా(32)ని పంపింది. కానీ.. ఈ ఇద్దరితో పాటు రిషబ్ పంత్ (32) కూడా సెమీస్ ఒత్తిడిని అధిగమించలేక వికెట్లు చేజార్చుకున్నారు. ఒత్తిడి అధిగమించడంలో ఆరితేరిన మహేంద్రసింగ్ ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించి ఉంటే..? బాగుండేదని గంగూలీ తాజాగా చెప్పుకొచ్చాడు.


‘భారత్ జట్టు వరల్డ్‌కప్ గ్రూప్ దశలో అద్భుతంగా ఆడింది. కానీ.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆశ్చర్యకంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసింది. ఆరంభంలోనే కీలక వికెట్లు చేజారినా.. ధోనీని ఆలస్యంగా బ్యాటింగ్‌కి పంపడం పెద్ద తప్పిదం. భారత్ 5/3తో నిలిచిన స్థితిలో యువ హిట్టర్ పంత్‌ని సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించే సత్తా ఎవరికైనా టీమ్‌లో ఉందంటే..? అది ధోనీకి మాత్రమే. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ స్వీయ తప్పిదంతో భారీ మూల్యం చెల్లించుకుంది’ అని గంగూలీ మండిపడ్డాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: