వరల్డ్ కప్ సెమీస్ లో భారత జట్టు ఓడిపోవడం సగటు అభిమానిని తీవ్రంగా బాధిస్తోంది. టాప్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అవటం, నాలుగో స్థానంపై కన్ఫ్యూషన్, ఏడో స్థానంలో ధోనీ బ్యాటింగ్.. ఇవన్నీ ఎవరినీ మనశ్శాంతిగా ఉండనీయడం లేదు. నాలుగో స్థానంలో ధోనీని పంపుంటే అతని సీనియారిటీ పనికొచ్చేదని పలువురి అభిప్రాయం. అయితే ధోనీని కాకుండా పంత్ ను ముందు పంపడం వెనుక కోచ్ రవిశాస్త్తి నిర్ణయం ఉందా అని సందేహాలు వస్తున్నాయి.

 

 

ఇలాంటి కీలక సమయంలో పంత్ ను నాలుగో స్థానంలో పంపడం రవిశాస్త్రి నిర్ణయమంటున్నారు. ధోనీ వచ్చుంటే వెనుక పాండ్యా, జడేజా, పంత్ ఉండటంతో కాస్త ధైర్యం ఉండేది. ఎప్పుడైతే జడేజా ఔటయ్యాడో ధోనీపై ఒత్తిడి పెరిగిపోయింది. ధోనీ ఏడో స్థానంలో రావటంతో వెనుక బ్యాట్స్ మెన్ ఎవరూ లేకపోయారు. ఇది రవిశాస్త్రి నిర్ణయమేనని సీనియర్లు మండిపడుతున్నారు. ధోనీ అవుటయ్యాక గ్యాలరీలో కోహ్లీ అసహనంతో రవిశాస్త్రి వద్దకు వచ్చి మాట్లాడటం ఇందుకు నిదర్శనం. నాలుగో స్థానంలో అంబటి రాయుడే సరైనోడనే అభిప్రాయం కోహ్లీకి ఉండేది. రాయుడును వరల్డ్ కప్ కు తయారు చేస్తామని కూడా ప్రకటించాడు. ఓ సిరీస్ లో ఫెయిలైన రాయుడును బీసీసీఐ పక్కన పెట్టింది. ఎన్నో సిరీస్ ల్లో ధావన్, రైనా, రోహిత్ ఫెయిలయినా పలు అవకాశాలిచ్చిన బీసీసీఐ రాయుడుకు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎన్నో విమర్శల మధ్య రాయుడును స్టాండ్ బై గా తీసుకున్నారు. టోర్నీలో ఇద్దరు గాయపడినా రాయుడిని కాకుండా మయాంక్ అగర్వాల్ ను రప్పించారు. వన్డేలే అలవాటు లేని మయాంక్ ను డైరక్ట్ గా వరల్డ్ కప్ తీసుకోవటం వెనుక రవిశాస్త్రి నిర్ణయమేనంటున్నారు.

 

 

దీనిపై గవాస్కర్ కూడా “భారత్ రెండేళ్లుగా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది. నాలుగో స్థానంలో ధోనీని పంపకపోవటం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్లేస్ లో అంబటి రాయుడు కరెక్ట్. స్టాండ్ బై గా తీసుకుని కూడా జట్టులో ఆడనివ్వకపోవడం ఏంటో అర్ధం కాలేదు” అన్నాడు. మయాంక్ ను పిలిపించినా ఆడించలేదు. ఇదంతా చూస్తుంటే జట్టులో నిర్ణయాలు కోచ్, కెప్టెన్ కలిసి నిర్ణయాలు తీసుకోవట్లేదనే అనుకోవాలి. “కోచ్ రవిశాస్త్రి సొంతంగా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ఇప్పుడు టీమ్ బలైంది.. స్టాండ్ బైగా ఉన్న రాయుడును కాదని అసలు స్క్వాడ్ లో లేని మయాంక్ ను పిలిపించాలన్న నిర్ణయం కోచ్ దా.. కెప్టెన్ దా! తాగుడుపై రవిశాస్త్రికి ఉన్న శ్రద్ధ టీమ్ పై లేవు” అని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: