రోహిత్ శర్మ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో 5 శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.


డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియన్ ఓపెనర్ గత ఏడాది బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేదానికి గురయ్యాడు. అనంతరం ఈ వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చి మంచి ఆటతీరును కనబరిచాడు. ఈ టోర్నీలో 647 పరుగులు చేసి రెండవ ఆటగాడిగా నిలిచాడు.


కేన్ విలియమ్సన్: ఈ ప్రపంచకప్ లో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరిందంటే దానికి ముఖ్య కారణం కేన్ విలియమ్స అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో ఓపెనర్స్ విఫలం అవుతున్న ఒంటిచేత్తో టీమ్ ను ముందుకు నడిపించాడు కేన్ విలియమ్సన్. ఈ టోర్నిలో ఇప్పటి వరకు విలియమ్సన్ 91.33 సగటుతో 548 పరుగులు చేశాడు.


షకీబ్ అల్ హసన్: ప్రపంచకప్ లో కిబ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడని చెప్పాలి. ఆ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ లో ఇతడే ముఖ్య పాత్ర ఈ టోర్నీలో 606 పరుగులు మరియు 11 వికెట్స్ కూడా తీశాడు.


జోరూట్: ఇంగ్లాండ్ తరుపున ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ రూట్ నే. రెండు శతకాలు, మూడు అర్ధ శతకాలతో జట్టుని ముందుండి నడిపించి ఫైనల్ కు చేర్చిన ఘనత రూట్ దే. ఈ టోర్నీలో ఇప్పటివరకు 549 పరుగులు సాధించాడు.


మిచెల్ స్టార్క్: ఈ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా సెమీస్ వరకు రావడానికి ఒకే ఒక్క కారణం మిచెల్ స్టార్క్ తన పదునైన యార్కేర్స్ తో ఎంతటి ప్లేయర్ నైనా పెవిలియన్ కి పంపేవాడు. ఈ టోర్నీలో 27 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.


జస్ ప్రీత్ బుమ్రా: ప్రస్తుతం ఈ భారత్ బౌలర్ ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్. తన యోర్కేర్స్ తో బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఈ టోర్నిలో జాస్ ప్రీత్ బుమ్రా 18 వికెట్లు తీశాడు. అంతేకాకాకుండా ఎక్కువ మేడెన్స్ కూడా చేశాడు.


లుకీ ఫెర్గుసన్: న్యూజిలాండ్ ఫైనల్ కి చేరడంలో మరో కీలక పాత్ర బౌలర్ లుకీ  ఫెర్గుసన్. బ్యాట్స్ మెన్లు చేతులెత్తేసిన, ఈ బౌలర్ అండతో ఆ జట్టు ఫైనల్ కు చేరింది ఈ టోర్నీలో లుకీ ఫెర్గుసన్ 18 వికెట్లు తీశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: