ఇమిటేషన్ అనేది ఓ కళ. సినిమా యాక్టర్స్, పొలిటీషియన్స్, క్రికెటర్స్.. ఇలా ఎవరూ ఈ ఇమిటేషన్ కు అతీతులు కారు. ప్రత్యేక స్టైల్ ఉంటే ఇమిటేషన్ హైలైట్ అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. భారతజట్టులో బూమ్రా బౌలింగ్ స్టైల్ స్పెషల్ గాఉంటుంది. బాల్ ను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని నడుస్తూ మెల్లగా పరుగు మొదలుపెట్టి బాల్ వేసే తీరు ఓస్టైల్ ను కలిగి ఉంటుంది.

 

ఇప్పుడు ఈ బౌలింగ్ స్టైల్ నే పలువురు ఇమిటేట్ చేస్తున్నారు. అయితే.. పిల్లలు, యువతే కాకుండా బూమ్రా బౌలింగ్ కు వృద్ధులు కూడా ఆకర్షితులవుతున్నారు. తమిళనాడుకు చెందిన 70ఏళ్ల బామ్మ బూమ్రా బౌలింగ్ ను అనుకరిస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అయింది. యూట్యూబ్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. చిన్నసైజ్ ఫుట్ బాల్ ను పట్టుకుని బూమ్రా స్టైల్ లో బామ్మ గారు బౌలింగ్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈవీడియోను చూసిన బూమ్రా.. బామ్మగారి ఇమిటేషన్ కు ముచ్చట పడిపోయాడు. ట్విట్టర్ లో శాంతా సక్కుబాయ్ అనే మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ ”This made my day” అంటూ రాసుకుని రీట్వీట్ చేశాడు.

 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా షేర్ అవుతోంది. బూమ్రా లానే.. ఇంకా కపిల్ దేవ్, ఆంబ్రోస్, మలింగ, ముత్తయ్య మురళీధరన్, సోహైల్ తన్వీర్, పాల్ ఆడమ్స్ వంటి ఆటగాళ్ల బౌలింగ్ స్టైల్ కూడా ఇలానే స్టైలిష్ గా ఉంటాయి. బూమ్రా బౌలింగ్ లో రాణిస్తూ భారత్ కు ప్రధాన బౌలర్ గా మారాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: