లండ‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నీర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇది సునాయాస‌న విజ‌య‌ల‌క్ష్య‌మే అని చెప్పాలి.


ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విలియ‌మ్స‌న్ 30 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. క‌ప్‌లో బాగా రాణించి ఫైన‌ల్లో త‌క్ఉవ స్కోరుకే అవుట్ అవ్వ‌డం కూడా జ‌ట్టు త‌క్కువ ప‌రుగుల చేయ‌డంపై ప్ర‌భావం చూపింది. ఈ క్ర‌మంలోనే విలియ‌మ్స‌న్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్థనే రికార్డును విలియమ్సన్‌ బ్రేక్‌ చేశాడు. 


2007 వరల్డ్‌కప్‌లో జయవర్థనే 548 పరుగులు సాధించాడు. ఓ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన కెప్టెన్ రికార్డు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌య‌వ‌ర్థ‌నే పేరు మీదే ఉండ‌గా... దానిని విలియ‌మ్స‌న్ తాజాగా బ్రేక్ చేశాడు.  2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్‌ సాధించిన పరుగులు 578. ఈ లిస్టులో విలియమ్సన్‌, జయవర్థనే తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్‌(539 పరుగులు, 2007), అరోన్‌ ఫించ్‌(507 పరుగులు, 2019), ఏబీ డివిలియర్స్‌( 482 పరుగులు, 2015)లు ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ 465 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: