ప్ర‌పంచం చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్స్‌లో క‌ల‌క‌లం రేగింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ స్ట్రీకర్ మైదానంలోకి దూసుకెళ్లే యత్నం చేసింది. స్విమ్ సూట్‌ను పోలిన నల్లని డ్రెస్‌ను ధరించిన ఓ మహిళ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకెళ్లబోయింది. అయితే ఆమెను అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అడ్డుకుని స్టేడియం బయటకు తీసుకెళ్లారు. కొడుకు పోర్న్ ఛానల్ కోసం ఆ తల్లి ఈ ఘ‌న‌కార్యం చేసింద‌ని తేలింది.


న్యూజిలాండ్ జట్టు స్కోరు 1 వికెట్ నష్టానికి 45 పరుగుల వద్ద ఉండగా ఆ మహిళ మైదానంలోకి దూసుకెళ్లేందుకు యత్నించింది. ఓ అడల్ట్ వెబ్‌సైట్‌కు చెందిన పదాలను డ్రెస్‌పై రాసుకున్న ఆ మహిళ సదరు వెబ్‌సైట్ ప్రచారం కోసమే ఆ పని చేసిందని తరువాత నిర్దారణకు వచ్చారు.గతంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సమయంలోనూ.. అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలానే ప్రయత్నించిందని తెలుస్తోంది. ఇక యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఇలా అంతర్జాతీయ మ్యాచ్‌లను అడ్డుకోవడం సరికాదని ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు.


కాగా, లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఈ త‌ర‌హా దృష్టి మ‌ళ్లింపు చ‌ర్య‌లు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఛార్టెడ్ విమానాలు వివాదాస్ప‌ద‌ సందేశాలతో కూడిన బ్యానర్లతో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ముందస్తుగానే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం(14)తో పాటు రిజర్వ్‌డే సోమవారం(15) కూడా నోఫ్లైజోన్‌గా ప్రకటించాలని సంబంధిత అధికారులకు ఐసీసీ విజ్ఞప్తి చేసింది. అయితే, స్టేడియం పైన జరిగేవి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా...స్టేడియంలో ఈ క‌ల‌కలం చోటు చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: