గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాల్లోకి అనేక మంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వచ్చారు.  అలా వచ్చిన వాళ్లలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు.  ఆయన బీజేపీ తరపున ఢిల్లీనుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.  బీజేపీలో జాయిన్ అయ్యిన కొన్ని రోజులకే ఢిల్లీ సీటు రావడం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగిపోయాయి.  


గంభీర్ జాయిన్ అయ్యినట్టుగానే బాక్సర్ విజయేందర్ సింగ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.  ఢిల్లీ సౌత్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఢిల్లీ సౌత్ లో బీజేపీ విజయం సాధించింది.  రమేష్ బిధూరి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.  


పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత తిరిగి బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టాడు.  యుఎస్ లో జరుగుతున్న యూఎస్ టెక్నికల్ నాకౌట్ ప్రొఫెషనల్ సర్క్యూట్ లో విజయేందర్ సింగ్ అమెరికన్ బాక్సర్ స్నిడర్ ను ఓడించాడు.  


నాలుగు రౌండ్స్ లో జరిగిన ఈ బాక్సింగ్ పోటీలో విజయేందర్ సింగ్ తన పంచ్ లతో ప్రత్యర్థిని మట్టి కురిపించాడు.  చాన్నాళ్లు బాక్సింగ్ కు దూరంగా ఉన్నా తనలో సత్తా తగ్గలేదని అంటున్నాడు విజయ్.  


మరింత సమాచారం తెలుసుకోండి: