ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఆతిథ్య జట్టు ఎప్పుడూ ప్రపంచకప్ ను గెలవదు, గెలవలేదు..అనే నానుడి దశాబ్దాల పాటు  చెల్లింది. 1975 లో  మొదలైన క్రికెట్ ప్రపంచప్ ను చాలా కాలం పాటు ఆతిథ్య జట్టు నెగ్గలేకపోయింది. తొలి తొలి ప్రపంచకప్  లకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు వరసగా వెస్టిండీస్, ఇండియాలు  విజేతలుగా నిలిచాయి. 


ఇండియాలో ప్రపంచకప్ జరిగితే ఆసీస్ నెగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్  జరిగితే పాకిస్తాన్ నెగ్గింది. అలా ప్రధాన ఆతిధ్య జట్లకు ప్రపంచకప్ నెగ్గే యోగం లేదన్నట్టుగా దశాబ్దాల పాటు  సంప్రదాయం సాగింది. అయితే ఆ రాతను మార్చింది టీమిండియా. 2011  ప్రపంచకప్ కు టీమిండియా ప్రధాన ఆతిథ్య జట్టుగా కాగా ఆ ప్రపంచకప్ విజేత కూడా  టీమిండియానే. అలా తొలి సారి గత సంప్రదాయానికి బ్రేక్ వేసింది.


ఆ తర్వాత అదే పరంపర  కొనసాగుతూ ఉండటం గమనార్హం. 2015 ప్రపంచకప్ కు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఆస్ట్రేలియా ట్రోఫీని నెగ్గింది. అలా మరోసారి ఆతిథ్య జట్టే విజేతగా నిలిచింది. ఇక తాజాగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ సారి ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇచ్చింది ఇంగ్లండ్ – వేల్స్. ఇలా ప్రధాన ఆతిథ్య జట్టు ప్రపంచకప్ నెగ్గింది. విశేషం ఏమిటంటే.. వచ్చేసారి క్రికెట్ ప్రపంచకప్ కు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: