నిన్న యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ఘట్టం ముగిసింది. ప్రపంచ కప్ విజేతలుగా ఇంగ్లాండ్ సైన్యం నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కు సిసలైన ముగింపు లభించింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీయగా, సూపర్ ఓవర్ లో పోరాడి మరీ విజయాన్నందుకున్న ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా నిలిచింది. 


10 జట్లు పాల్గొన్న ఈ వన్డే క్రికెట్ పోరాటంలో ఇంగ్లాండ్ జట్టు జగజ్జేతగా నిలిచింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విజేతగా నిలవడం ఇదే ప్రథమం. 1979, 1987, 1992లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్ ఈసారి కప్ ఎగరేసుకెళ్లింది. మొదట ఒక ఓవర్ ఆడిన ఇంగ్లాండ్ 15 పరుగులు చేసింది. అయితే, విజయానికి కచ్చితంగా 16 పరుగులు చేయాల్సిన స్థితిలో న్యూజిలాండ్ కూడా సరిగ్గా 15 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా అవతరించింది.  


కాగా, గతంతో పోలిస్తే ఈసారి ప్రపంచకప్ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ పెంచారు. కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు రూ.27.42 కోట్లు బహుమతిగా అందించారు. ఫైనల్లో ఓటమితో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.14 కోట్లు దక్కాయి.  ఇక సెమీస్ లో ఓడిన భారత్, ఆసీస్ లకు చెరో రూ.5.6 కోట్లు ముట్టజెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: