ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో అంచనాలకు మించి సంచలనాలతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు వెళ్ళింది. వాస్తవంగా టోర్నీకి ముందు న్యూజిలాండ్ గట్టి ప్రత్యర్థి అని అందరూ భావించారు. అయితే ఈ టోర్నమెంట్లో ఆ జట్టు ప్రస్థానం పడుతూలేస్తూ ముందుకు సాగింది. చివరి మూడు మ్యాచ్‌ల‌లో ఓడిపోయినా ... పాకిస్తాన్తో సరిసమానంగా 11 పాయింట్లు సాధించినా చివరకు నెట్ ర‌న్‌రేట్‌తో న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టింది.


న్యూజిలాండ్ ఫైన‌ల్‌కు వ‌చ్చిదంటే అందుకు కార‌ణం కెప్టెన్ విలియ‌మ్స‌న్ ఒంటరి పోరాట‌మే అని చెప్పాలి. టోర్నీలో రెండు సెంచ‌రీలు, రెండు హాఫ్ సెంచ‌రీల‌తో పాటు అత‌డి కెప్టెన్సీ వ‌ల్లే ఫైన‌ల్‌కు చేరుకుంది. బ్యాటింగ్‌లో విలియ‌మ్స‌న్ మినహా ఎవ్వ‌రూ రాణించ‌లేదు. అందుకే అత‌డు మ్యాన్ ఆఫ్ ద సీరిస్ హీరో అయ్యాడు. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో న్యూజిలాండ్ వ‌ర‌ల్డ్‌క‌ప్ హీరో అయితే విల‌న్ మాత్రం గ‌ఫ్టిల్ అని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.


న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్‌ వైఫల్యమే. సీనియర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. గఫ్టిల్ సెమీస్‌లో ధోనీని ర‌న్ అవుట్ చేయ‌డం ఒక్క‌టే అత‌డికి ల‌భించిన ఊర‌ట‌. చివ‌ర‌కు ఫైన‌ల్లోనూ అత‌డి వ‌ల్లే ఓడిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్‌ నాలుగో బంతిని ఓవర్‌ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. 


ఇక సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ తొలి ఐదు బంతులు ఆడిన నీష‌మ్ జ‌ట్టును గెలుపు వాకిట‌కు చేర్చేశాడు. సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి ప్రపంచ కప్‌ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్‌ అనంతరం గప్టిల్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. కీవీస్ జ‌నాలు కూడా గ‌ఫ్టిల్‌ను విమ‌ర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: