లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్ తో అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్స్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి వరల్డ్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ టైటిల్ గెలవలేదు. ఇంగ్లాండ్ జట్టుకు ఇదే మొదటి కప్ కావడంతో టైటిల్ గెలవాలనే కల నెరవేరింది.
న్యూజిలాండ్ జట్టు యాభై ఓవర్లలో 241 పరుగులు సాధించింది.

242 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ టై అవ్వడంతో ఫలితాన్ని తేల్చడం కోసం ఐసీసీ సూపర్ ఓవర్ నిర్వహించింది. సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్లూ సమానంగ స్కోర్ చేయగా మ్యాచ్ టైగా ముగిసింది.


దీనిద్వారా విజేతగా నిర్ణయంచడానికి బౌండ్రీ కౌంట్ నిబంధనను అనుసరించి ఇంగ్లండ్ సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ కంటే అధిక బౌండ్రీలు సాధించడంతో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు.

ఈ బౌండ్రీ కౌంటర్ నిబంధన అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని పేర్కొంటూ భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐసిసిపై విరుచుకు పడ్డాడు. బౌండ్రీ కౌంట్ నిబంధనను ప్రకటించడంపై గంభీర్ ఐసీసీ తీరును తప్పుపట్టారు. ఇదొక చెత్త రూలంటూ మండిపడ్డారు. కాగా కడవరకూ పోరాడిన ఇరు జట్లను గంభీర్ అభినందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: