2019 వరల్డ్ కప్ ఫైనల్ ను ఎవరూ అంత తేలికగా మరచిపోలేరు. బాల్..బాల్ కీ టెన్షన్. రన్ రన్ కీ బీపీ లెవల్స్ పెరిగిపోయి.. నరాలు తెగే ఉత్కంఠ. నాటకీయంగా ముగిసిన మ్యాచ్ లో అంతిమ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. మ్యాచ్ టై అయిందంటే ఓకే.. సూపర్ ఓవర్ కూడా టై అవడమే విశేషం. అంటే.. రెండు జట్లు సమ ఉజ్జీలనే అర్ధం. కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఇద్దరినీ విజేతలుగా ప్రకటించడం. కానీ జరిగింది వేరు. దీనిపై సగటు క్రికెట్ అభిమానికి వచ్చిన ఆలోచనే పలువురు మాజీ క్రెకెటర్లు, సీనియర్లకూ వచ్చింది. దీనిపై పలు వ్యాఖ్యలు చేశారు. ఏళ్లనాటి ఐసీసీ చెత్త రూల్స్ పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.


 

సంజయ్ మంజ్రేకర్: 2019 వరల్డ్ కప్ మరచిపోలేనిది. ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య ఫైనల్ అనేది ఎంత నిజమో.. ఇంగ్లండ్ – న్యూజిలాండ్ ఇద్దరూ విజేతలనేది అంతే నిజం. అదే జరిగుండాల్సింది.


స్కాట్ స్టైరిస్: ఐసీసీ చేసిన ఈ పని పెద్ద జోక్ లా ఉంది.


గౌతమ్ గంభీర్: రెండు జట్లూ విజయానికి అర్హత కలవే. కానీ ఎక్కువ బౌండరీస్ కొట్టిన వారినే విజేతగా ప్రకటించడం ఐసీసీ చెత్త రూల్స్ లో ఒకటి. ఖచ్చితంగా నిబంధనలు మార్చాల్సిందే.


యువరాజ్ సింగ్: రూల్స్ రూల్పే. కానీ ఈ రూల్ ను ఒప్పుకోలేకపోతున్నా.న్యూజిలాండ్ బాగా పోరాడింది.


రోహిత్ శర్మ: కొన్ని ఐసీసీ రూల్స్ ని మార్చాల్సిందే. దీనిపై చర్చ అవసరం.


బ్రెట్ లీ: టై అయిన ఈమ్యాచ్ లో విజేతను నిర్ణయించిన విధానం ఏమాత్రం సరికాదు. ఈ రూల్ ని మార్చాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: