ఐసీసీ ప్రపంచకప్‌ 2019 టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీనీ ప్ర‌క‌టించింది. మొత్తం 12 మంది స‌భ్యులు ఉన్న ఈ ఉత్త‌మ జ‌ట్టులో భారత్‌ నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లే అవకాశం దక్కించుకోగా.. అత్యధికంగా ఇంగ్లండ్‌ నుంచి నలుగురికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్‌ తరఫున ఒక్కరు ఎంపికయ్యారు. 


భార‌త్ నుంచి టీం ఇండియా ఓపెనర్‌గా ఐదు సెంచ‌రీల‌తో రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్‌శ‌ర్మ‌తో పాటు యార్కర్ల కింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రాకుల మాత్రమే చోటుదక్కింది. ఇక ఈ మెగా జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా.. వికెట్‌ కీపర్‌గా ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి అవకాశం ఇచ్చారు. విలియ‌మ్స‌న్ మ్యాన్ ఆఫ్ ద టోర్న‌మెంట్‌గా కూడా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.


ఇక ప్రపంచకప్‌ టోర్నీ ప్రదర్శన ఆధారంగానే ఈ జట్టును ఎంపిక చేయడంతో భారత కెప్టెన్‌కు చోటు ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. 12వ ఆటగాడిగా న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ను ఎంపిక చేశారు.


ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ
విలియమ్సన్‌(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జాసన్‌ రాయ్‌ (ఓపెనర్స్‌), జోరూట్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ స్టార్క్‌, జోఫ్రా ఆర్చర్‌, ఫెర్గ్‌సన్‌, జస్ప్రిత్‌ బుమ్రా.


12వ ఆటగాడు: ట్రెంట్‌ బౌల్ట్‌



మరింత సమాచారం తెలుసుకోండి: