టీమిండియాకు త్వరలోనే కొత్త కోచ్ రానున్నారట. ప్రపంచకప్ సెమీస్‌లోనే టీమిండియా ఓడిపోయి ఇంటిదారి పట్టడంతో టీమిండియాకు కోచింగ్ స్టాఫ్ మార్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. హెడ్ కోచ్ రావిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌లను మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉందట. 


వీరిని మాత్రమే కాకుండా ఫిజియోథెరఫిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, స్ట్రెంగ్త్ మరియు కండిషనింగ్ కోచ్ పదువులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు త్వరలో బీసీసీఐ ప్రకటించనుందట. దీంతో ప్రస్తుతం జుట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రికి కొనసాగాలని ఆసక్తి ఉంటే అతను కూడా దరఖాస్తు చేయాల్సిందేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


'ప్రపంచకప్'తో ఈ కోచ్‌ల కాంట్రాక్టు ముగిసినప్పటికీ వచ్చేనెలలో ప్రారంభమయ్యే విండీస్ టూర్ వరుకు వీరి కాంట్రాక్టును పొడిగించారు. 2017లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి సెప్టెంబర్‌లో జరిగే సౌతాఫ్రికా సిరీస్‌ నాటికి కోచ్ గా కొనసాగుతారా లేక కొత్త కోచ్ వస్తారా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: