ప్రపంచ కప్  సిరీస్ లో అనుకోని ఓటమి తో  ఇంటికి చేరుకుంది టీమిండియా, అయితే సిరీస్ మొత్తం ఉత్తమ ఫలితాలను రాబట్టిన టీమిండియా ఆటగాళ్లు సెమీస్ లో మాత్రం చేతులెత్తేశారు, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్  ఘోరంగా విఫలం అవడంతో టీమ్ ఇండియా ఇంటికి వచ్చేసింది.
 
అయితే  ఓటమితో టీమిండియాలో  అనుకోని మార్పులు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ ని కెప్టెన్ బాధ్యతల నుండి తొలగించి,వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచులకు రోహిత్ శర్మ ని కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ.దీంతో టీమ్ ఇండియా కోచ్ ను మారుస్తారా అనే అనుమానం ఇప్పుడు అందరిలో ఉంది.

దీనిపై స్పందిస్తూ  భారత హెడ్ కోచ్ గా మళ్ళీ రవి శాస్త్రి నే కొనసాగుతారని బీసీసీఐ కి చెందిన ఓ అధికారి అన్నారు. రవిశాస్త్రి భారత జట్టు కోసం ఎంతో చేశారు. ఆయన కోచ్ గా ఉన్నప్పుడే భారత జట్టు టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. అలాగే వన్డేలో ఇంగ్లండ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఒక్క మ్యాచ్ విఫలమవడంతో ఆయన కోచింగ్ ని  విమర్శించడం తప్పు అని ఆయన అన్నారు. రవి శాస్త్రి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: