వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ముగిశాయి.  రేపు సెలక్టర్లు జట్టు కూర్పుపై సమావేశం కాబోతున్నారు.  సీనియర్లలో ఎవరు ఉంటారు.  ఎవర్ని పక్కన పెడతారు.  ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని సెలక్షన్ ఉంటుంది అనే దానిపై రేపు జరిగే సమయావేశంలో కన్ఫర్మ్ అవుతుంది.  


సీనియర్లలో ధోనిని పక్కన పెట్టకపోయినా.. జట్టులో ఉంచినా.. మైదానంలోకి  దిగే సందర్భాలు తక్కువగా ఉండొచ్చని అంటున్నారు.  ధోని వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు.  వయసు పెరగడంతో అప్పటి పటిమ ఇప్పుడు ఉండదు.  అనుభవం ఉన్నది కాబట్టి అది యువ ఆటగాళ్లకు పనికొస్తుంది అనడంలో సందేహం లేదు. 

టీం ఇండియాలో ధోని సూపర్ వికెట్ కీపర్ అందులో సందేహం లేదు.  ధోని స్థానంలో మరొకరిని ఇప్పటి వరకుఊహించుకోలేదు.  ఎల్లకాలం టీం లో ధోని ఉండలేదు కాబట్టి కొత్త వికెట్ కీపర్ కోసం టీం ఇండియా దృష్టి పెట్టింది.  దీని వారసులుగా వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ లను ఎంపిక చేసే అవకాశం ఉంది.  


రిషబ్ పంత్ ఇప్పటికే టీం ఇండియాలో ఆడుతున్నాడు.  వరల్డ్ కప్ లో కూడా ఆడిన అనుభవం ఉంది.  దీంతోవీరిద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.  లేదంటే టెస్ట్ లకు ఒకరు మిగతా ఫార్మాట్ లో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది.  కరేబియన్ టూర్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం తక్కువ ఉంది కాబట్టి సారధ్య బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: