క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన స‌ర్ డాన్ బ్రాడ్‌మాన్‌తో అత‌న్ని పోలుస్తారు. టెస్టులు, వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు, వంద సెంచరీలు  చేసిన క్రికెటర్ గా స‌చిన్‌కు రికార్డు ఉంది. అటువంటి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది.

 

ఐసీసీ హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో స‌చిన్‌కు చోటు ద‌క్కింది. లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో స‌చిన్‌ను స‌న్మానించారు. సౌతాఫ్రికా పేస్ బౌల‌ర్ అల‌న్ డోనాల్డ్‌తో పాటు స‌చిన్‌కు ఈ గౌర‌వం దక్కింది. వీరితోపాటు ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ క్యాథ‌రిన్ ఫిజ్‌ ప్యాట్రిక్ కూడా హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకుంది. క్రికెట్ కు గౌరవం తెచ్చిన మ‌హా క్రీడాకారుల‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు క‌ల్పిస్తారు. అవార్డు అందుకున్న సచిన.. “హాల్ ఫ‌మ్ ఫేమ్‌లో చోటు ద‌క్క‌డం గౌర‌వంగా భావిస్తున్న”ట్లు  చెప్పాడు.

 

అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ 200 టెస్టుల్లో-15921 పరుగులు, 51 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 463 ఇన్నింగ్స్ లో 18426 పరుగులు చేసి 49 సెంచరీలు చేశాడు. ఇవన్నీ ప్రపంచ రికార్డులే. ప్రపంచంలోని మేటి ఫాస్ట్ బౌలర్ సౌతాఫ్రికాకు చెందిన అలెన్ డోనాల్డ్ 72 టెస్టుల్లో330 వికెట్లు, 164 వన్డేల్లో 272 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ క్యాథ‌రిన్ ఫిజ్‌ ప్యాట్రిక్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఖ్యాతికెక్కింది. 13 టెస్టుల్లో 60 వికెట్లు, 109 వన్డేల్లో 180 వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కోచ్ గా మూడు సార్లు ఆ జట్టు ప్రపంచ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: